NHM Chittoor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం (DMHO) .. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పీడియాట్రీషియన్లు, థియేటర్ అసిస్టెంట్లు, కార్డియాలజిస్టు, డెంటల్ సర్జన్, మల్టీ రిహెబిలిటేషన్ వర్కర్, ఓబీజీ స్పెషలిస్ట్ తదితర పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Medical and Health Officer, Chittoor, Andhra Pradesh
దరఖాస్తు రుసుము: రూ. 300
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: