AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

NEET-UG 2026 Fee Refund: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2026 ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు తమ బ్యాంక్ వివరాలను సమర్పించేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంది. వివరాలు సమర్పించడానికి చివరి గడువు మే 27, 2026 రాత్రి 11:50 వరకు మాత్రమే.

NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి
Neet Ug 2026 Fee Refund
Rajashekher G
|

Updated on: May 23, 2026 | 10:27 AM

Share

National Testing Agency (NTA) నిర్వహిస్తున్న NEET (UG) 2026 పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు ప్రత్యేకంగా రీఫండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించడానికి చివరి గడువు మే 27, 2026 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే అని NTA స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు రీఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో NEET (UG) 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకి ప్రవేశించి, అక్కడ కనిపించే “Refund Link” పై క్లిక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి.

ఖాతా వివరాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు అభ్యర్థులు అవసరమైతే రద్దు చేసిన చెక్కు (Cancelled Cheque) ను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత అవే తుది వివరాలుగా పరిగణించబడతాయి. అనంతరం ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదని NTA వెల్లడించింది.

సమర్పించాల్సిన బ్యాంకు వివరాలు

  1. ఖాతాదారుని పేరు
  2. బ్యాంకు ఖాతా సంఖ్య
  3. IFSC కోడ్
  4. బ్యాంకు పేరు
  5. రద్దు చేసిన చెక్కు (ఐచ్ఛికం)
  6. NTA అభ్యర్థులకు మరో ముఖ్య సూచన కూడా చేసింది. NEET (UG) 2026 ఫీజుకు సంబంధించి Chargeback ప్రక్రియను ప్రారంభించవద్దని కోరింది.

NEET UG 2026 పునఃపరీక్ష ఎప్పుడు?

NEET (UG) 2026 Re-Examination ను NTA జూన్ 21, 2026 (ఆదివారం) నిర్వహించనుంది.

పరీక్ష సమయం:

  • మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు (IST)

గతంలో నిర్వహించిన NEET-UG పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్, అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సీబీఐ సహా పలు దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో పునఃపరీక్షను ప్రకటించారు.

NEET UG 2026 ఫీజు రీఫండ్ కోసం ఎలా అప్లై చేయాలి?

  1. NTA NEET అధికారిక వెబ్‌సైట్( https://neet.nta.nic.in/ ) ను సందర్శించండి.
  2. “NEET (UG) 2026 Fee Refund Window” లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  4. బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయండి.
  5. అవసరమైతే Cancelled Cheque అప్‌లోడ్ చేయండి.
  6. వివరాలను ధృవీకరించి Submit చేయండి.
  7. దీంతో, మీ నీట్ యూజీ ఫీజు వాపసు ప్రక్రియ పూర్తయింది.

Follow Us