NEET UG 2024 Answer Key: నీట్‌ యూజీ తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే!

|

Jun 04, 2024 | 2:28 PM

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడికి నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సమాయత్తమవుతోంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్ధులు..

NEET UG 2024 Answer Key: నీట్‌ యూజీ తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే!
NEET UG 2024 Answer Key
Follow us on

న్యూఢిల్లీ, జూన్‌ 4: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడికి నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సమాయత్తమవుతోంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్‌ కీ మంగళవారం (జూన్‌ 4) విడుదలైంది. పరీక్షకు హజరైన అభ్యర్ధులు నీట్‌ యూజీ తుది ఆన్సర్‌ కీని అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 14న నీట్‌ యూజీ ఫలితాలు విడుదలకానున్నాయి.

కాగా ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరందరికీ మే 5న దేశవ్యాప్తంగా 571 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. నీట్‌ యూజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

నీట్‌ యూజీ 2024 తుది ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.