NEET UG 2022: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2022ని వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే #PostponeNEETUG2022 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అంతకుముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ నమోదు కోసం గడువును పొడిగించింది. అంతేకాదు నీట్ యూజీ పరీక్ష జూలై 17, 2022గా నిర్ణయించారు. కానీ అభ్యర్థులు నీట్ 2022ని వాయిదా వేయాలని కోరుతున్నారు. ఎందుకంటే పరీక్షకు సిద్ధం కావడానికి తగినంత సమయం లేదని వారు డిమాండ్ చేస్తున్నారు.
నీట్‌ను వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్
నీట్ యూజీ వాయిదాపై ఇప్పటి వరకు ఎన్‌టీఏ కానీ సంబంధిత అధికార యంత్రాంగం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తే నీట్ వాయిదా పడే అవకాశం ఉందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. నీట్ పరీక్షకు సంబంధించిన ఏవైనా అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు NTA విడుదల చేసే అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని అధికారులు సూచించారు.
మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
NEET UG దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6న ప్రారంభమైంది. ఇంతకు ముందు NEET UG నమోదుకు చివరి తేదీ మే 6గా నిర్ణయించారు. కానీ ఇప్పుడది మే 15 వరకు పొడిగించారు. నీట్‌కి అప్లై చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా ఫారమ్‌ను నింపవచ్చు. నీట్ యూజీ పరీక్ష ఈ సంవత్సరం పెన్, పేపర్ విధానంలో నిర్వహిస్తు్న్నారు. పరీక్ష 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. నీట్ పరీక్ష 17 జూలై 2022న నిర్వహిస్తారు. ఈ పరీక్షకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ) నుంచి 180 ప్రశ్నలని అడుగుతారు.
మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి