
హైదరాబాద్, జనవరి 25: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ, ఎండీఎస్-2026 ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం నీట్ ఎమ్‌డీఎస్ పరీక్ష మే 2, 2026వ తేదీన జరగనుంది. ఇక ఆగస్టు 30వ తేదీన నీట్ పీజీ 2026 పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌బీఈఎంఎస్ వెల్లడించింది.
ఇక నీట్ పీజీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయవల్సిన కటాఫ్ తేదీలను కూడా ఎన్‌బీఈఎంఎస్ వెల్లడించింది. నీట్ ఎమ్‌డీఎస్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ఇంటర్న్‌షిప్ మే 31, 2026వ తేదీలోపు పూర్తి చేయవల్సి ఉంటుంది. ఇక నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు సెప్టెంబర్ 30, 2026వ తేదీలోపు తమ ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేయవల్సి ఉంటుంది.
నీట్ పీజీ 2026 పరీక్ష షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.