NEET 2021 Exam Centre: నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. విదేశాల్లో ఎగ్జామ్ సెంటర్..

|

Jul 23, 2021 | 9:11 AM

NEET 2021 Exam Centre: ఈ ఏడాది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(నీట్) కోసం దుబాయ్‌లో ఎగ్జామినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని...

NEET 2021 Exam Centre: నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. విదేశాల్లో ఎగ్జామ్ సెంటర్..
Neet Exams
Follow us on

NEET 2021 Exam Centre: ఈ ఏడాది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(నీట్) కోసం దుబాయ్‌లో ఎగ్జామినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న విద్యార్థులు నీట్ పరీక్ష రాసేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, గల్ఫ దేశాల్లో ఉన్న విద్యార్థులకు అనుగుణంగా.. నీట్‌ను ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సానుకూలంగా స్పందించింది. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేందుకు దుబాయ్‌‌లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.

సెప్టెంబర్ 21, 2021 జరగనున్న ఈ నీట్ పరీక్ష కోసం ఇప్పటికే కువైట్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనికి జతగా దుబాయ్ లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దుబాయ్‌లో నీట్ ఎగ్జామ్‌కు సంబంధించి అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకు సమాచారం అందించాల్సింగా కోరారు. కువైట్, దుబాయ్‌లోని భారత రాయబార కేంద్రాల అధికారులు.. ఈ పరీక్షను న్యాయబద్ధంగా, సురక్షితంగా నిర్వహించడానికి ఎన్‌టిఏకు పూర్తి సహకారం అందించేలా ఆదేశ ప్రభుత్వాని సూచించాలని కోరారు.

కాగా, ఈ సంవత్సరం నీట్ పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించబోతున్నారు. హిందీ, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా, గుజరాతీ, మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలతో పాటు.. కొత్తగా పంజాబీ, మళయాలం భాషల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, అంతకుముందు ఆగస్టు 1వ తేదీన షెడ్యూల్ చేసిన ఈ నీట్ ఎగ్జామ్‌ను సెప్టెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచారు. అలాగే.. పరీక్షా కేంద్రాలను కూడా పెంచారు.

Also read:

Tokyo Olympics 2021 Live: ర్యాంకింగ్ రౌండ్‌లో దీపికా 9వ స్థానం.. కొరియన్ ప్లేయర్ ప్రపంచ రికార్డు..

Drone: సరిహద్దు ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన పోలీసులు.. అందులోంచి ఐదు కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

Senior Citizens: వృద్ధులకు అండగా కేంద్ర కొత్త చట్టాలు.. ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. బిల్లులో ఎముందంటే..?