అమరావతి, అక్టోబర్ 23: రాష్ట్రంలోని విద్యార్ధుల ఆధార్ అప్‌డేట్‌కు పాఠశాల ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాగంటి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఓ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విద్యాశాఖ తొమ్మిది, పదో తరగతులు చదువుతున్న విద్యార్థులకు ‘అపార్’ సంఖ్య కేటాయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. దీనికి విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్ పోర్టల్, ఆధార్ కార్డులో ఒకేలా ఉండేలా చూడాలని పేర్కొంది. చాలా మందికి ఆధార్‌లో తప్పుల సవరణకు అవసరం ఏర్పడింది. దీంతో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే పంచాయతీ, మున్సిపాలిటీల్లో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ మాత్రమే కావాలని ఆధార్ కేంద్రాల వారు కోరుతున్నారు. చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవు. దీంతో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియలో సమస్య ఏర్పడుతోందని’ అన్నారు. ఇప్పటికైనా దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఇండియన్ రైల్వే శాఖలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ నియామక ప్రక్రియకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో లాగిన్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తులు రైల్వేశాఖ ఆమోదించిందా? లేదా తిరస్కరించిందా? అనే విషయం తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సీఈఎల్ నంబర్ 03/ 2024తో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నోటిఫికేషన్ ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29 వరకు కొనసాగింది. ఇక ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్షలు డిసెంబర్ 6 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో రాత పరీక్షలు ఉంటాయి. అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు.
ఆర్‌ఆర్‌బీ జేఈ అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి.