మిశ్రధాదు నిగం లిమిటెడ్ (మిధాని)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకమైన మెటల్, మెటల్ అలైస్‌ను తయారీ చేసే ఈ సంస్థ కేంద్ర డిఫెన్స్ మినిస్టరీ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఖాళీలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 54 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఫిట్టర్) (13), జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్) (02), జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) (06), సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ) (20) , సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్) (10), సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) (03) ఖాళీలు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు నవంబర్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇక వయోపరిమితి విషయానికొస్తే.. జేవోటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-10-2023 నాటికి 30 ఏళ్లు, ఎస్‌ఓటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 35 ఏళ్లు మించకూడదు. పే స్కేల్ విషయానికొస్తే జేవోటీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 ఎస్‌ఓటీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 21,900 వేతనంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 1వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..