Breaking: కేవీపీవై 2022 పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డులు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌..

|

Feb 24, 2022 | 7:14 AM

కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) 2022 పరీక్ష తేదీని కేంద్రం విడుదలచేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఈ పరీక్షను మే 22న నిర్వహించనున్నట్లు ప్రకటించింది..

Breaking: కేవీపీవై 2022 పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డులు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌..
Kvpy 2022
Follow us on

KVPY 2022 exam date released: కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) 2022 పరీక్ష తేదీని కేంద్రం విడుదలచేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఈ పరీక్షను మే 22న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఏడాది మొదటి నెల (జనవరి) 9 న కేవీపీవై పరీక్ష జరగనుండగా కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ ఉధృతి కొంత తగ్గిన నేపథ్యంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తాజా ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ kvpy.iisc.ac.in ను చెక్‌ చేయవల్సిందిగా విద్యార్ధులకు సూచించింది. దీంతో వివిధ స్ట్రీముల్లో, దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో హిందీ, ఆంగ్ల భాషల్లో ఆప్టిట్యూడ్ పరీక్ష ఆహ్వానించడానికిగానూ రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ పరీక్షలో ప్రతిభ కనబరచిన B.Sc/B.S/B.Stat/B.Math/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/M.S చదువుతున్న విద్యార్ధులకు 3 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.5000 ఫెలోషిప్‌, అలాగే వార్షిక గ్రాంట్ కింద రూ. 20,000లను అందిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎమ్మెస్‌ చదివే విద్యార్ధులకు 4, 5 సంవత్సరాల్లో నెలకు రూ.7000ల ఫెలోషిప్‌, అలాగే వార్షిక గ్రాంట్ కింద రూ. 28,000లను అందిస్తారు.కాగా కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన అనేది జాతీయ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌. బేసిక్ సైన్స్ కోర్సులు, పరిశోధనా వృత్తిని అభ్యసించే విద్యార్ధులకు ఫెలోషిప్‌ అందించడానికి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

Also Read:

ICAI CA May 2022: సీఏ మే 2022 సెషన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు..