KVIC Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో.. ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు.. పీజీ పాసైనవారు అర్హులు..

|

Jul 28, 2022 | 4:36 PM

కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (KVIC).. దేశంలోని వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన 60 యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల (Young Professional Posts) భర్తీకి..

KVIC Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో.. ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు.. పీజీ పాసైనవారు అర్హులు..
Kvic
Follow us on

KVIC Young Professional Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (KVIC).. దేశంలోని వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన 60 యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం జోన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.

  • సౌత్‌ జోన్‌-10
  • సెంట్రల్‌ జోన్‌-10
  • ఈస్ట్‌ జోన్‌-10
  • వెస్ట్‌ జోన్‌-10
  • నార్త్‌ జోన్‌-10
  • నార్త్‌ ఈస్ట్-10

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జులై 30, 2022 నాటికి తప్పనిసరిగా 27 ఏళ్లకు మించరాదు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌/సైన్స్‌ విభాగాల్లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 24 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్‌ జోన్‌ అభ్యర్ధులు మాత్రం జులై 30 లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. యంగ్ ప్రొఫెషనల్స్‌గా ఎంపికైన అనంతరం నెలకు రూ.25000ల నుంచి రూ.30000 లతో పాటు ఇతర అలవెన్సుల రూపంలో రూ.2500 నుంచి రూ.3000లు అదనంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.