అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్రశిక్షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 11వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 29,621 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు 45,621 దరఖాస్తులు వచ్చినట్లు ఏప్రిల్ 10వ తేదీన ఆచప ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇతర సందేహాలు, వివరాలకు 18004258599 ఫోన్ నంబరును సంప్రందించాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,104 పాఠశాలల్లో టోఫెల్ పరీక్షకును ప్రశాంతంగా నిర్వహించారు. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. ఇక 6 నుంచి 9వ తరగతి చదువుతున్న 16, 52,142 మంది రేపు అంటే ఏప్రిల్ 12వ తేదీన టోఫెల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరచిన అభ్యర్ధులకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ సర్టిఫికెట్ అందిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు ఏప్రిల్ 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.