Kakatiya University Exams 2025: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలన్నీ వాయిదా..?

కాకతీయ యూనివర్సిటీ  సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. నవంబర్‌ 18 నుంచి నిర్వహించే 1, 3, 5వ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కేయూ రిసెర్చ్‌ స్కాలర్స్,​‍ విద్యార్థి సంఘాల నాయకులు పరిపాలన భవనంలోని..

Kakatiya University Exams 2025: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలన్నీ వాయిదా..?
Kakatiya University Degree Semester Exams

Updated on: Nov 16, 2025 | 7:41 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 16: కాకతీయ యూనివర్సిటీ  సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. నవంబర్‌ 18 నుంచి నిర్వహించే 1, 3, 5వ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కేయూ రిసెర్చ్‌ స్కాలర్స్,​‍ విద్యార్థి సంఘాల నాయకులు పరిపాలన భవనంలోని వీసీ ప్రతాపరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కేయూ పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు ఇంకా సిలబస్ పూర్తి కాలేదని అందులో తెలిపారు. సిలబస్ పూర్తికాక ముందే పరీక్షలు నిర్వహిస్తే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉందని, దీంతో ఉత్తీర్ణత శాతం పడిపోతుందని వారు వీసీకి విన్నవించారు.

సెలబస్ పూర్తిగా అయితేనే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, అప్పటివరకు పరీక్షలు వాయిదా వేయాలని వీసికి విద్యార్ధి సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల కోసం బంద్‌ నిర్వహించడం, వర్షాల నేపథ్యంలో తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని అన్నారు. పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవడం కోసం కొంతకాలం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు వీసీకి అందజేసిన వినతిపత్రంలో వెల్లడించారు.

బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాల నిబంధనల సవరణ

భారత నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 నుంచి నీట్‌ నర్సింగ్‌ ప్రవేశపెట్టేవరకు ఏపీ నర్సింగ్‌ సెట్‌- 2025 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని అందులో పేర్కొంది. జనరల్‌ విద్యార్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 40, జనరల్‌- పీడబ్ల్యూడీలకు 45, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీలకు చెందిన పీడబ్ల్యూడీలకు 40 పర్సంటైల్‌ చొప్పున సాధించాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.