NTA Facial Recognition: జేఈఈ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలకు చెక్‌.. 2026 నుంచి ఫేషియల్‌ రికగ్నిషన్‌ షురూ!

జేఈఈ, నీట్‌ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ పరీక్షల నిర్వహణకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ వెరిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. జాతీయ స్థాయిలో పోటీ తీవ్రంగా ఉండే జేఈఈ, నీట్‌ వంటి ఎన్టీయే నిర్వహించే..

NTA Facial Recognition: జేఈఈ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలకు చెక్‌.. 2026 నుంచి ఫేషియల్‌ రికగ్నిషన్‌ షురూ!
NTA facial recognition to JEE, NEET Exams

Updated on: Dec 25, 2025 | 2:57 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: జేఈఈ, నీట్‌ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ పరీక్షల నిర్వహణకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ వెరిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. జాతీయ స్థాయిలో పోటీ తీవ్రంగా ఉండే జేఈఈ, నీట్‌ వంటి ఎన్టీయే నిర్వహించే పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఎన్టీయే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది పరీక్షా కేంద్రాలలో ముఖ గుర్తింపు భద్రతా చర్యలను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అభ్యర్థుల లైవ్‌ ఫొటోలను క్యాప్చర్‌ చేసే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యోచిస్తున్నారు. వెబ్‌క్యామ్, మొబైల్‌ ఫోన్‌ ద్వారా రియల్‌ టైంలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం వల్ల పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసే అవకాశానికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆధార్‌ ఆధారిత ఫేస్‌ అథంటికేషన్‌ను గతేడాది నీట్‌ యూజీ పరీక్షల సమయంలో ఢిల్లీలో పైలట్‌ విధానంలో ఎంపిక చేసిన కొన్ని పరీక్ష కేంద్రాల్లో అమలు చేశారు. దీంతో 2026 ఏడాది నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు.

సెప్టెంబర్‌లో జారీ చేసిన పబ్లిక్ నోటీసులో, JEE (మెయిన్) 2026 అభ్యర్థులు తమ ఆధార్ కార్డును సరైన పేరు, పుట్టిన తేదీ, తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరుతో అప్‌డేట్‌ చేసుకోవాలని NTA కోరింది. అక్టోబర్‌లో జరిగిన మరో నోటీసులో.. ఆధార్ ప్రామాణీకరణ ద్వారా UIDAI ద్వారా పేరు, పుట్టిన తేదీ, ఫొటో, చిరునామా వంటి వివరాలను పొందుతామని NTA తెలిపింది. గత సంవత్సరం ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికలో ఈ మేరకు పరీక్షల సమగ్రతను కాపాడటానికి బయోమెట్రిక్ ప్రామాణీకరణతో సహా మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.