
హైదరాబాద్, జనవరి 26: జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జరగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 21 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో జనవరి 28, 29 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మి్ కార్డులను పొందుపరిచింది. అభ్యర్ధులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2026 పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఈ పరీక్షలు రాస్తున్నారు.
జనవరి 28న పేపర్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 29వ తేదీన పేపర్-2ఏ(బీఆర్క్) పేపర్-2బి (బీప్లానింగ్) ఉదయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు.
అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకొని.. దానిపై ఫొటో అంటించాలి. అలాగే దానిపై వేలిముద్ర వేయాలి. పరీక్ష కేంద్రంకి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డుతోపాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు చేసే సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకెళ్లాలి. పెద్ద బటన్లు ఉండే చొక్కాలు ధరిస్తే అనుమతించరు. అడ్మిట్ కార్డులో పేర్కొన్న ఇతర నిబంధనలను తప్పనిసరిగా చదవి.. ఆ మేరక పాటించవల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.