ITBP Recruitment: ఐటీబీపీలో ఎస్‌ఐ స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే గోల్డెన్ ఛాన్స్‌..

|

Aug 04, 2022 | 4:25 PM

ITBP Recruitment: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ-స్టాఫ్‌ నర్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు...

ITBP Recruitment: ఐటీబీపీలో ఎస్‌ఐ స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే గోల్డెన్ ఛాన్స్‌..
Follow us on

ITBP Recruitment: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ-స్టాఫ్‌ నర్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ-స్టాఫ్‌ నర్స్‌) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఇంటర్మీడియట్, సెంట్రల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయబడిన జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-08-2022న మొదలై 15-09-2022తో ముగియనుంది.

* జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..