IOCL: టెన్త్‌/డిప్లొమా అర్హతతో ఐఓసీఎల్‌లో 1746 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులకున్నాయంటే..

|

Dec 14, 2022 | 6:55 AM

ముంబాయిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా వివిధ డివిజన్‌లలో.. 1746 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

IOCL: టెన్త్‌/డిప్లొమా అర్హతతో ఐఓసీఎల్‌లో 1746 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులకున్నాయంటే..
IOCL
Follow us on

ముంబాయిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా వివిధ డివిజన్‌లలో.. 1746 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణలో 53, ఆంధ్రప్రదేశ్ 53 వరకు ఖాళీలున్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్- ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిస్ – ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్ – ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ -ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్ – మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ – డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్ – డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్లు) తదితర విభాగాల్లో ఖాళీగాఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఇంజనీరింగ్‌ డిగ్రీ/బీఏ/బీకాం/బీఎస్సీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 3, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్‌ నిబంధనలమేరకు ప్రతి నెలా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.