IB Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Apr 15, 2022 | 8:49 PM

Intelligence Bureau Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

IB Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Ib Recruitment
Follow us on

Intelligence Bureau Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో 94 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ లేదా బీఈలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేయాలి. వీటితో పాటు 2020, 21, 22లో వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కార్డు కలిగి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత గేట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 500, ఇతరులు రూ. 600 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ 16-04-2022న మొదలై 07-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Elon Musk: ఎలాన్‌ మస్క్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్విట్టర్‌ వాటాదారు.. చాలా తక్కువకు అడిగారంటూ ట్వీట్‌..

IPL 2022 Purple Cap: రసవత్తరంగా పర్పుల్‌ క్యాప్‌ రేస్‌.. నేటి మ్యాచ్‌తో మళ్లీ అతడికేనా టాప్ ప్లేస్?

PM Modi: ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్.. రానున్న పదేళ్లలో రికార్డ్ స్థాయిలో కొత్త వైద్యులు .. ప్రధాని మోడీ