Infosys Hiring: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో ఆహ్వానం! పూర్తి వివరాలు ఇవే!

ఇన్ఫోసిస్.. 2025 అకడమిక్ ఇయర్ పూర్తి చేసుకునే యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ దిగ్గజ సంస్థ.. తాజా క్యాంపస్ – ఆఫ్ క్యాంపస్ నియామకాల ద్వారా స్కిల్ ఉన్న అభ్యర్థులను ఆకర్షిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కలగా మారిన ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సాధించే అవకాశం ఇప్పుడు మరింత దగ్గరైంది. ఆకర్షణీయమైన వేతనాలు, అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణతో పాటు బలమైన కెరీర్‌కు ఇది బేస్‌గా నిలవనుంది.

Infosys Hiring: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో ఆహ్వానం!  పూర్తి వివరాలు ఇవే!
Infosys 2026 Recruitment

Edited By:

Updated on: Dec 26, 2025 | 10:39 AM

ఈ నియామకాల్లో అభ్యర్థుల నైపుణ్యాలను బట్టి వివిధ స్థాయిల్లో ప్యాకేజీలు అందించనున్నారు. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్–3 స్థాయికి ఎంపికైన వారికి ఏకంగా రూ.21 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. అదే ఎల్–2 స్థాయిలో ఎంపికైతే రూ.16 లక్షల ప్యాకేజీ అందనుంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్–1 పోస్టులకు రూ.10 లక్షల వార్షిక వేతనంతో పాటు ఉద్యోగంలో చేరిన వెంటనే రూ.1 లక్ష జాయినింగ్ బోనస్ ఇవ్వనున్నారు. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్‌గా ఎంపికైన వారికి రూ.6.25 లక్షల ప్యాకేజీతో పాటు రూ.75 వేల జాయినింగ్ బోనస్ ఉంటుంది. శిక్షణ కాలం పూర్తయ్యాక అభ్యర్థి ప్రదర్శన, నైపుణ్యాల ఆధారంగా ఈ వేతనాలు మరింత పెరిగే అవకాశమూ ఉంది.

ఎలా అప్లై చేసుకోవాలి

ఈ భారీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనాలంటే నిర్దిష్ట విద్యార్హతలు తప్పనిసరి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. అయితే 2025లోనే తమ విద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఇన్ఫోసిస్ అధికారిక లింక్ https://surveys.infosysapps.com/r/a/SPOffCampusregistration_Dec25 ద్వారా అప్లై చేయాలి.

మూడు దశల్లో ఎంపిక

ఇన్ఫోసిస్ ఎంపిక ప్రక్రియ సాధారణంగా మూడు దశల్లో కొనసాగుతుంది. ముందుగా ఆన్‌లైన్ అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్ ఎబిలిటీతో పాటు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ముఖ్యంగా స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులకు కోడింగ్ రౌండ్ కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఈ దశలో విజయం సాధించిన వారిని టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో జావా, పైథాన్, సీ++ వంటి ప్రోగ్రామింగ్ భాషలు, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌పై లోతైన ప్రశ్నలు ఎదురవుతాయి. అలాగే అభ్యర్థులు చేసిన ప్రాజెక్టులపై కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిగా హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు ఎంపికవుతారు.

మొత్తంగా చూస్తే.. 2025లో చదువు పూర్తిచేసే యువతకు ఇన్ఫోసిస్ రిక్రూట్‌మెంట్ ఒక గొప్ప అవకాశంగా మారింది. సరైన ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తే… కలల ఐటీ కెరీర్‌కు ఇదే సరైన దారి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.