Railway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులు ఉన్నాయంటే..?

|

Aug 09, 2023 | 3:50 PM

రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ పార్లమెంటుకు వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో తెల్పింది. దేశంలోనే అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా రైల్వేశాఖ మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పుడు అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగానూ రైల్వే శాఖ గుర్తింపు పొందడం విశేషం. ఇలా అన్ని రైల్వేజోన్ల పరిధుల్లో దేశ వ్యప్తంగా మొత్తం 2.50 లక్షల రైల్వే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిల్లో రైల్వేలో కీలకంగా వ్యవహరించే ఆపరేషనల్‌ సేఫ్టీ విభాగంలో దాదాపు 53,178 పోస్టులు పెండింగులో..

Railway Jobs:  రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులు ఉన్నాయంటే..?
Indian Railways
Follow us on

అమరావతి, ఆగస్టు 9: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ పార్లమెంటుకు వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో తెల్పింది. దేశంలోనే అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా రైల్వేశాఖ మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పుడు అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగానూ రైల్వే శాఖ గుర్తింపు పొందడం విశేషం. ఇలా అన్ని రైల్వేజోన్ల పరిధుల్లో దేశ వ్యప్తంగా మొత్తం 2.50 లక్షల రైల్వే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిల్లో రైల్వేలో కీలకంగా వ్యవహరించే ఆపరేషనల్‌ సేఫ్టీ విభాగంలో దాదాపు 53,178 పోస్టులు పెండింగులో ఉంన్నాయి. అత్యధికంగా 2.48 లక్షల గ్రూప్‌ సీ ఉద్యాగాలు ఖాళీగా ఉన్నాయి.

ఏయే విభాగంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..

  • గ్రూప్‌ ఏ ఉద్యోగ ఖాళీలు 1965
  • గ్రూప్‌ బీ ఉద్యోగ ఖాళీలు 105
  • నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగ ఖాళీలు 32,636 (అత్యధికంగా)
  • దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌లో ఉద్యోగ ఖాళీలు 4,897

తెలంగాణ ఈసెట్-2023 అభ్యర్థులకు సీట్ల కేటాయింపు

ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్లను ఆగస్టు 8న కేటాయించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో మొత్తం 9,680 సీట్లు, ఫార్మసీలో 74 మందికి సీట్లను కేటాయించారు. 2,092 ఇంజినీరింగ్ సీట్లు, 1129 ఫార్మా సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో సీటు వచ్చిన అభ్యర్థులు ఆగస్టు 12లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ తెలిపారు. తుది విడత ఈసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 20 నుంచి ఉంటుందని కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.