Indian Navy Recruitment 2022: పదో తరగతి/ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో 338 పోస్టులు.. పూర్తి వివరాలివే..

|

Jun 21, 2022 | 2:14 PM

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy) ముంబాయిలోని నావెల్‌ డాక్‌యార్డ్‌.. అప్రెంటిస్‌ పోస్టు (Apprentice posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Indian Navy Recruitment 2022: పదో తరగతి/ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో 338 పోస్టులు.. పూర్తి వివరాలివే..
Indian Navy
Follow us on

Indian Navy Apprentice Recruitment 2022: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy) ముంబాయిలోని నావెల్‌ డాక్‌యార్డ్‌.. అప్రెంటిస్‌ పోస్టు (Apprentice posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 338

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అప్రెంటిస్‌ పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్ (జనరల్), షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, మెకానిక్ రెఫ్ అండ్‌ ఏసీ, టైలర్ వంటి ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధులు ఆగస్టు 1, 2001 నుంచి అక్టోబర్‌ 31, 2008 మధ్య జన్మించి ఉండాలి.

స్టైపెండ్‌:

  • ఐటీఐ అభ్యర్ధులకు నెలకు రూ. 7,000
  • ఐటీఐ లేని అభ్యర్ధులకు నెలకు రూ. 6,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతిలో 50 శాతం మార్కులతోపాటు, పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: పోస్టునుబట్టి రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.