Indian Navy SSC Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy ) 2023 జనవరి ఎస్టీ 23 కోర్సు.. వివిధ విభాగాల్లోని షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 155
పోస్టుల వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు
బ్రాంచుల వారీగా ఖాళీలు ఇలా..
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 93
విభాగాలు: జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్
అర్హతలు: కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
విభాగాలు: ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: జనవరి 2, 1998 నుంచి జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: