Indian Coast Guard 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్, లాస్కర్ లాంటి రకరకాల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.gov.inలో తమ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ డిసెంబర్ 11న జారీ చేశారు. ఆఫ్‌లైన్ ఫారమ్‌లను సమర్పించడానికి గడువు తేదీ జనవరి 30గా నిర్ధారించారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టుల పేర్లు, ఖాళీల సంఖ్య
1. ఇంజిన్ డ్రైవర్: 5 పోస్టులు
2. సారంగ్ లాస్కర్: 2 పోస్టులు
3.ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 5 పోస్టులు
4. ఫైర్‌మెన్: 53 పోస్టులు
5. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 11 పోస్టులు
6. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్: 5 పోస్టులు
7. స్టోర్ కీపర్ గ్రేడ్ 2: 3 పోస్టులు
8. స్ప్రే పెయింటర్ – 1 పోస్ట్
9. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్: 1 పోస్ట్
10. లాస్కర్: 5 పోస్టులు
11. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): 3 పోస్ట్‌లు
12. అన్‌స్కిల్డ్ లేబర్: 2 పోస్ట్‌లు
జీతం, అర్హతలు
1. ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్: PB 1, 5200-20200 + రూ. 2400 (GP)
2. ఫైర్ ఇంజన్ డ్రైవర్: PB – 1, 5200-20200 + రూ. 2000 (GP)
3. ఫైర్‌మ్యాన్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్ గ్రేడ్ 2, స్ప్రే పెయింటర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్, లాస్కర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్), అన్‌స్కిల్డ్ లేబర్ – PB – 1, 5200-20200 + రూ. 1900 (GP) అన్ని పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్, అనుభవం ఉండాలి. ఇతర వివరాలకు ఒక్కసారి నోటిఫికేషన్ తనిఖీ చేయండి.