Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!

|

May 24, 2021 | 12:04 PM

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ జారీ చేసింది...

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!
Follow us on

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) బ్రాంచ్‌లో ఎంట్రీ స్కీమ్ 27వ కోర్స్ అక్టోబర్ 2021 కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పెళ్లికాని యువతీయువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఉచిత కమిషన్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఎంపికైనవారు 14 ఏళ్లు రెగ్యులర్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొదట 10 ఏళ్లు, ఆ తర్వాత 4 ఏళ్లు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 జూన్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారతీయ ఆర్మీకి చెందిన రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ http://www.joinindianarmy.nic.in/ లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 4

విద్యార్హతలు- ఎల్ఎల్‌బీ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ తర్వాత మూడేళ్ల లా లేదా ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 55 శాతం మార్కులతో పాస్ కావాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్‌లో అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి. వయస్సు- 21 నుంచి 27 ఏళ్లు
స్టైపెండ్- రూ.56,100 వరకు ఉంటుంది.

దరఖాస్తు చేయండి ఇలా

అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Officer Entry Apply/Login పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Registration లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ఇతర వివరాలు ఎంటర్ చేసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

Inter Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే పరీక్షలు.. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

NIPER Kolkata Recruitment 2021: నైప‌ర్ కోల్‌క‌తాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..