
హైదరాబాద్, నవంబర్ 18: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2026 (GATE 2026) పరీక్ష రాసే విద్యార్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి తాజాగా కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు టెస్ట్ పేపర్ల వారీగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఏ రోజు ఏ పేపర్ పరీక్ష ఉంటుందనే విషయాన్ని ఈ షెడ్యూల్‌లో వివరంగా పేర్కొంది. ఈ కింది టేబుల్‌లో ఆ వివరాలు చెక్ చేసుకోండి..
కాగా గేట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల సవరణ గడువు ముగిసినా గేట్ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల సవరణల కోసం ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు గువహటి ఐఐటీ తెలిపింది. దీంతో కరెక్షన్ విండోను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. మొత్తం 30 పేపర్లలో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్‌తోపాటు బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్షలో సాధించిన స్కోర్‌కు ఫలితాలు వెలువడినప్పటి నుంచి వరుసగా మూడేళ్లపాటు గేట్ స్కోర్‌కు విలువ ఉంటుంది. ఆ స్కోర్‌తో మూడేళ్లలో ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అభ్యర్ధులు గరిష్ఠంగా 2 పేపర్ల వరకు పరీక్ష రాయవచ్చు.
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) పరీక్షను యేటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఐఐటీ గువాహటి ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
గేట్ 2026 అప్లికేషన్ కరక్షన్ విండో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.