IIM Vizag Recruitment 2022: నెలకు రూ.50,000లజీతంతో.. విశాఖపట్నం ఐఐఎంలో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

|

May 12, 2022 | 1:11 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM).. అసిస్టెంట్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌, సీనియర్ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Assistant Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి..

IIM Vizag Recruitment 2022: నెలకు రూ.50,000లజీతంతో.. విశాఖపట్నం ఐఐఎంలో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
Iim Visakhapatnam
Follow us on

IIM Visakhapatnam Assistant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM).. అసిస్టెంట్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌, సీనియర్ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Assistant Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టులు: అసిస్టెంట్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌, సీనియర్ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.

విభాగాలు: అకడమిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌, అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రోగ్రామ్స్‌, సీడీఎస్‌ అండ్‌ అల్యూమ్ని రిలేషన్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 30,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • అసిస్టెంట్‌ పోస్టులకు బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
  • సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
  • సీనియర్ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Senior Administrative Officer HR, Indian Institute of Management Visakhapatnam, Andhra Bank School of Business Building, Andhra University Campus, Visakhapatnam, Andhra Pradesh – 530 003

దరఖాస్తులకు చివరి తేదీ: మే 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

TS Tenth Exams 2022: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..