HQ Northern Command jobs 2022: ఇండియన్‌ ఆర్మీలోని నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు..

|

Jul 26, 2022 | 4:31 PM

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీలోని నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ (HQ Northern Command).. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group 'C' Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

HQ Northern Command jobs 2022: ఇండియన్‌ ఆర్మీలోని నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు..
Indian Army
Follow us on

HQ Northern Command Group C Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీలోని నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ (HQ Northern Command).. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group ‘C’ Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతిలో పాస్‌ అయిన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించి ఇతర ముఖ్య సమాచారం ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 23

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్ పోస్టులు: 5
  • వెహికిల్‌ మెకానిక్‌ పోస్టులు: 1
  • క్లీనర్‌ పోస్టులు: 1
  • ఫైర్‌మెన్లు పోస్టులు: 14
  • మజ్దూర్లు పోస్టులు: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.19,900ల నుంచి రూ.45,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా నార్మల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకుగానూ 150 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో ఈ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ప్రశ్నల సరళి:

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌: 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌: 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • న్యూమరికల్ ఆప్టిట్యూడ్‌: 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్‌: 50 ప్రశ్నలకు 50 మార్కులు

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Commanding Officer 5171 ASC Bn (MT), PIN: 905171 C/O 56 APO

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (ఆగస్టు 22, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.