HPCL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో 294 ఉద్యోగాలు..

|

Jun 22, 2022 | 6:28 AM

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL).. ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన..

HPCL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో 294 ఉద్యోగాలు..
Hpcl
Follow us on

HPCL Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL).. ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 294

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులు

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, సివిల్‌, కెమికల్‌

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 37 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, డిగ్రీ/ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 23, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.