CRIS Recruitment 2022: అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లతో సహా అనేక పోస్టుల భర్తీకి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు CRIS అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫారమ్‌లో ఏదైనా తేడా కనిపిస్తే ఆ దరఖాస్తు తిరస్కరణకి గురవుతుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి 25 మే 2022 వరకు సమయం ఇచ్చారు. దరఖాస్తు చేయడానికి ముందు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డేటా అనలిస్ట్‌ల పోస్టులని భర్తీ చేస్తారు. అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (ఏఎస్‌ఈ)కి 144, అసిస్టెంట్ డేటా అనలిస్ట్ (ఏడీఏ) 6 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 25న ఈ రిక్రూట్‌మెంట్ కోసం పూర్తి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇందులో విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, జీతం వివరాలు ఉంటాయి. జీతం విషయానికొస్తే అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అసిస్టెంట్ డేటా అనలిస్ట్ 7వ పే కమిషన్ ప్రకారం పొందుతారు.
అర్హత
అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఇతర పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్ణీత విద్యార్హత, వయస్సు ప్రమాణాలు, చెల్లుబాటు అయ్యే గేట్ 2022 స్కోర్‌ను కలిగి ఉండాలి. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతను కలిగి ఉండాలి. IIT ఖరగ్‌పూర్ నిర్వహించే GATE 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వయస్సు పరిధి
రెండు పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితి 22 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇది కాకుండా రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. అయితే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి