Good News: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి శుభవార్త.. ఆ సమయం భారీగా తగ్గించింది..

Good News: చాలామంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని కలలు కంటారు. కానీ వీసా కారణాల వల్ల కొన్నిసార్లు అది కుదరకపోవచ్చు.

Good News: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి శుభవార్త.. ఆ సమయం భారీగా తగ్గించింది..
Students

Updated on: Apr 20, 2022 | 5:20 PM

Good News: చాలామంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని కలలు కంటారు. కానీ వీసా కారణాల వల్ల కొన్నిసార్లు అది కుదరకపోవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి విద్యార్థుల కోసం అమెరికా విద్యార్థి వీసాల స్లాట్ల సంఖ్యను భారీగా పెంచింది. వాటి కోసం ఎదురుచూసే సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. దీంతో పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యుఎస్‌ వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలకు చెందిన విద్యార్థులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ పరిధి నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యార్థుల ఎదురుచూపులకు ఇక ఆ దేశం తెరదించింది. సోమవారం నుంచి భారీగా విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేసింది. ఫలితంగా స్లాట్ల కోసం వేచి ఉండే సమయం 911 రోజుల నుంచి ఒక్కసారిగా 68 రోజులకు తగ్గింది. అయితే హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో టూరిస్ట్‌ వీసా కోసం వేచి ఉండే సమయం 899 రోజులుగానే ఉంది. టూరిస్ట్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.

Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..

SAMEER Recruitment 2022: నెలకు రూ.30,000లజీతంతో సమీర్‌లో రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్‌! పరీక్ష పీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..