Work From Home: భవిష్యత్తులో పని విధానంలో ఈ మార్పులు తప్పవు.. ఆరిన్‌ క్యాపిటల్‌ ఛైర్మన్‌ మోహన్‌ దాస్‌..

Work From Home: భవిష్యత్తులో పని విధానంలో ఈ మార్పులు తప్పవు.. ఆరిన్‌ క్యాపిటల్‌ ఛైర్మన్‌ మోహన్‌ దాస్‌..
Work From Home

Work From Home: కరోనా మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా జీవన విధానాన్ని కూడా మార్చేసింది. తీసుకునే ఆహారం నుంచి పని సంస్కృతి వరకు అంతా మారిపోయింది. ఒకప్పుడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది కేవలం కొందరికి మాత్రమే..

Narender Vaitla

|

Feb 10, 2022 | 9:00 PM

Work From Home: కరోనా మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా జీవన విధానాన్ని కూడా మార్చేసింది. తీసుకునే ఆహారం నుంచి పని సంస్కృతి వరకు అంతా మారిపోయింది. ఒకప్పుడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే కరోనా పుణ్యామాని అప్పటి వరకు ఈ కల్చర్‌ను అనుసరించని కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఆచరించాల్సి వచ్చింది. కరోనా మొదటి వేవ్‌ నుంచి ఇప్పటి వరకు పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంభిస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఇంకా ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇంకొన్ని కంపెనీలు అయితే శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ను తీసుకొస్తున్నాయి.

అయితే భవిష్యత్తు అంతా వర్క్‌ ఫ్రమ్‌ విధానం కొనసాగించడం సరైంది కాదని, రానున్న రోజుల్లో హైబ్రిడ్‌ మోడల్‌ అందుబాటులోకి రావాలని చెబుతున్నారు ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్‌ టీవీ మోహన్‌దాస్‌. భవిష్యత్తు పని విధానంపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రానున్నాయో ఆయన మాటల్లోనే.. ‘గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చిన యువత ఎక్కువగా ఇంటి నుంచే పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక 30 ఏళ్లు దాటిన వారు వారంలో కొన్ని రోజులు ఆఫీసు, మరికొన్ని రోజులు ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక పెద్ద వారైతే పూర్తిగా ఆఫీసు నుంచే పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కొన్ని కంపెనీలు పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇక మరికొన్ని కంపెనీలు మొత్తం వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. అయితే నా దృష్టిలో మాత్రం భవిష్యత్తులో హైబ్రిడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి.

అంటే వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు ఆఫీసుకు వచ్చి పని చేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలి. సామాన్యంగా మానవులు సంఘ జీవులు వారు ఇతరులతో మాట్లాడాలి, సహ ఉద్యోగులతో ఎంత వర్చువల్‌గా మాట్లాడినా నేరుగా ఫేస్‌టుఫేస్‌ మాట్లాడిన భావన ఉండదు. శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పని చేయడం వల్ల ఎమోషనల్‌గా వీక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ వ్యాపారంలోనే అయినా మనుషులు నేరుగా మాట్లాడుకుంటేనే మంచి ఫలితం వస్తుంది. సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నా, తెలియని విషయాలను తెలుసుకోవాలన్నా నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే సాధ్యమవుతుంది.

ఎప్పటికీ ఇంట్లో నుంచే పని చేయడం వల్ల మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కోవిడ్‌ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సమయంలోనే ఓ కంపెనీ సీఈఓ ఏకంగా 900 మంది ఉద్యోగులను డిస్‌మిస్‌ చేశారన్న వార్త అందరినీ కలవరపరిచింది. ఇండస్ట్రీ వర్గాలను సైతం ఇది ఉలిక్కిపడేలా చేసింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది సౌకర్యంగానే ఉంటుంది. కానీ దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం అనర్థాలు తప్పవు. కాబట్టి హైబ్రిడ్ విధానాన్ని అవలంభించాల్సిందే’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Minister Harish Rao: తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

Ajinkya Rahane: ఆస్ట్రేలియాలో నేను తీసుకున్న నిర్ణయాలకు మరొకరు క్రెడిట్ తీసుకున్నారు: మాజీ కోచ్‌పై రహానే కీలక వ్యాఖ్యలు

AP Corona Cases: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu