టైర్-3 కాలేజీ అమ్మాయికి రూ.2 కోట్ల ప్యాకేజీ.. దేవశ్రీ విజయ రహస్యం ఇదే..

సాధారణ కాలేజీ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. రూ.6 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభించిన దేవశ్రీ భారతియా ప్రస్తుతం అమెరికాలో సుమారు రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నారు. కెరీర్ గ్రోత్‌కు సంబంధించి ఆమె పంచుకున్న కీలక టిప్స్ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కెరీర్‌లో తనలా రాణించాలంటే ఏం చేయాలో తన ఇన్‌స్టా పోస్ట్‌లో షేర్ చేసిన దేవశ్రీ.. సోషల్ మీడియాలో సంచలనంగా మారారు.

టైర్-3 కాలేజీ అమ్మాయికి రూ.2 కోట్ల ప్యాకేజీ.. దేవశ్రీ విజయ రహస్యం ఇదే..
Devasri Success Story

Updated on: Jun 27, 2026 | 12:50 PM

సాదాసీదా ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్నా కెరీర్‌లో గొప్పగా రాణించాలని కలలుకనే వారికి పుణెకి చెందిన దేవశ్రీ భారతియా ప్రేరణగా నిలుస్తోంది. పుణెకు చెందిన దేవశ్రీ  ఒక సాధారణ టైర్-3 ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏటా సుమారు రూ. 2 కోట్ల రూపాయల ప్యాకేజీ సంపాదిస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కేవలం వార్షిక రూ. 6 లక్షల జీతంతో తన కెరీర్ ప్రారంభించిన దేవశ్రీ.. కొన్ని సంవత్సరాల్లోనే రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ స్థాయికి చేరుకోవడం విశేషం. కెరీర్‌లో తక్కువ టైమ్‌లోనే తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నానో వివరిస్తూ దేవశ్రీ.. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని కెరీర్ టిప్స్ షేర్ చేసింది.

దేవశ్రీ పంచుకున్న తన విజయ రహస్యాలు, కెరీర్ టిప్స్ ఇవే:

1. లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రొఫైల్‌ను బలోపేతం చేయండి

దేవశ్రీ సలహా మేరకు.. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు. ఉద్యోగాల కోసం కేవలం సాధారణ జాబ్ పోర్టల్స్ మీదే ఆధారపడకూడదు. లింక్డ్‌ఇన్‌లో ప్రొఫైల్‌ను చాలా ప్రొఫెషనల్‌గా, బలంగా తయారు చేసుకోవాలి. మీ ప్రొఫైల్ బాగుంటే, కంపెనీల రిక్రూటర్లు (హెచ్ఆర్) వాళ్లే స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ విషయాన్ని గ్రహించడానికి తనకు మూడేళ్లు పట్టిందని తెలిపారు. కానీ ప్రస్తుత యువత కొన్ని నెలల్లోనే ఈ వ్యూహాన్ని నేర్చుకుని ప్రయోజనం పొందవచ్చని దేవశ్రీ సలహా ఇచ్చింది.

2. ప్రతి ఉద్యోగానికి తగ్గట్టు Resume మార్చండి

చాలా మంది అన్ని ఉద్యోగాలకు ఒకే విధమైన కామన్ రెజ్యూమే పంపిస్తుంటారు. అది తప్పు అని దేవశ్రీ అంటోంది. మీరు అప్లై చేసే ఉద్యోగాన్ని బట్టి మీ రెజ్యూమేలో మార్పులు చేయాలని సూచించారు. మీరు చేసిన ప్రాజెక్ట్‌లు, హ్యాకథాన్‌లలో పాల్గొన్న వివరాలు, రీసెర్చ్ వర్క్, టెక్నికల్ నైపుణ్యాలు వంటి కీలక అంశాలను రెజ్యూమేలో స్పష్టంగా హైలైట్ చేయాలి. ఆధునిక కంపెనీలు వాడే ATS (Applicant Tracking System) ఫ్రెండ్లీ రెజ్యూమేలను తయారు చేసుకోవడం వల్ల మీ ప్రొఫైల్ త్వరగా షార్ట్‌లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

3. తిరస్కరణలకు నిరాశపడకండి

కొన్నిసార్లు కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు ఆన్‌లైన్‌లో ఉంచినప్పటికీ, బ్యాక్-ఎండ్‌లో ఆ పొజిషన్లు యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. అందువల్ల ఆన్‌లైన్‌లో జాబ్‌కి అప్లై చేసినా.. సదరు కంపెనీ హెచ్ఆర్ నుంచి రెస్పాన్స్ రాకపోతే లేదా రిజెక్ట్ అయితే అస్సలు నిరాశపడకూడదు. ప్రయత్నాన్ని అస్సలు ఆపకుండా ముందుకు సాగడమే విజయానికి తొలి మెట్టుగా దేవశ్రీ సూచించారు.

4. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌పై ప్రత్యేక దృష్టి

సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంటర్వ్యూలలో విజయం సాధించాలంటే ముఖ్యంగా మూడు విషయాలపై పట్టు ఉండాలని దేవశ్రీ సూచించింది. డేటా స్ట్రక్చర్స్ (Data Structures), సిస్టమ్ డిజైన్ (System Design), కంపెనీ బిజినెస్ మోడల్ (మీరు ఇంటర్వ్యూ ఇచ్చే కంపెనీ అసలు ఏం చేస్తుంది. ఎలా లాభాలు గడిస్తుంది అనే అవగాహన ఉండాలి) విషయాలపై సరైన అవగాహన ఉండాలి.

దేవశ్రీ ఇన్‌స్టా పోస్ట్

కెరీర్‌లో పెద్ద విజయం అనేది కేవలం ఒక్క రాత్రిలోనో లేదా ఒకే ఒక్క అవకాశంతోనో రాదు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటే కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోలేరు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం, సరైన వ్యూహం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవశ్రీ భారతియా తన సక్సెస్ స్టోరీ ద్వారా యువతకు సందేశమిచ్చింది. ఏ కాలేజీలో చదివామన్న అంశం కంటే.. ఎలాంటి నైపుణ్యాలు సంపాదించాము.. కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నామన్నదే ఉద్యోగ ప్రపంచంలో కీలకమని దేవశ్రీ భారతియా సక్సెస్ స్టోరీతో అర్థమవుతోంది. పక్కా వ్యూహంతో నిరంతర ప్రయత్నం చేస్తే చిన్న కాలేజీలో చదువుకున్నా.. అంతర్జాతీయ స్థాయిలో భారీ అవకాశాలను అందుకోవచ్చని ఆమె ప్రయాణం యువతకు స్ఫూర్తినిస్తోంది.

Follow Us