కేంద్ర ప్రభుత్వ టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాదూన్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఆర్‌ఐ).. 72 గ్రూప్-సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఐటీఐ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 19, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.1500లు. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్థులు రూ.700లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.