Python Training: సాఫ్ట్‌వేర్ ఉద్యోగార్థులకు బంపరాఫర్.. ఉచితంగా పైథాన్ క్లాసెస్.. పూర్తి వివరాలు..
సాఫ్ట్‌వేర్ కోర్సులు తీసుకుంటున్న అభ్యర్థులకు శుభవార్త. మహబూబ్ హుస్సేన్ జిగర్ కెరీర్ గైడెన్స్ సెంటర్.. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్‌ను ఉచితంగా అందిస్తోంది. సోమవారం నుంచి ఈ ఉచిత తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ అబిడ్స్ లోని...
సాఫ్ట్‌వేర్ కోర్సులు తీసుకుంటున్న అభ్యర్థులకు శుభవార్త. మహబూబ్ హుస్సేన్ జిగర్ కెరీర్ గైడెన్స్ సెంటర్.. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్‌ను ఉచితంగా అందిస్తోంది. సోమవారం నుంచి ఈ ఉచిత తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ అబిడ్స్ లోని రామక్రిష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న జిగర్ హాల్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఈ కోర్సులో భాగంగా పైథాన్ వెబ్ డెపలప్ మెంట్‌లో ప్రాథమిక సమాచారం అందిస్తారు.
ఈ కోర్సుకు హాజరయ్యే అభ్యర్థులు ప్రాథమికంగా కోడింగ్‌పై అవగాహన ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బీఎస్‌సీ, బీసీఏ, ఎమ్‌సీఏ చేసిన వారు ఇందుకు అర్హులు. కోర్సులో భాగంగా హెచ్‌టీఎమ్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, మైఎస్‌క్యూఎల్‌ను నేర్పిస్తారు. వీటితో పాటు విద్యార్థులకు వెబ్‌సైట్ డిజైనింగ్‌పై అవగాహనకల్పిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పైథాన్‌కు భారీ డిమాండ్ ఉంది. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
వెబ్‌సైట్ డిజైనింగ్‌లో పైథాన్ లాంగ్వేజ్‌ది కీలక పాత్ర. డీజాంగో టూల్ సహాయంతో వెబ్‌సైట్స్‌ను సులభంగా రూపొందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా పైన తెలిపిన అడ్రస్‌లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. పూర్తి వివరాలో కోసం 9000191481, 9393876978 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..