ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఎంపికైతే నెలకు రూ.1,27,141 లక్షల జీతం..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. 77 సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ (జీడీఎంఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఎంపికైతే నెలకు రూ.1,27,141 లక్షల జీతం..
ESIC Faridabad

Updated on: Apr 24, 2023 | 1:58 PM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. 77 సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ (జీడీఎంఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఫార్మకాలజీ, క్యాజువాలిటీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాలో రిజిస్ట్రర్‌ అయ్యి ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు 2023, ఏప్రిల్‌ 26వ తేదీన ఉదయం 9 గంటల 15 నిమిషాలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్‌, విద్యార్హతలు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.1,27,141 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పటల్‌, ఎన్‌హెచ్‌-3, ఎన్‌ఐటీ, ఫరిదాబాద్‌.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us