EdCIL (India): బీటెక్‌ అర్హతతో నెలకు రూ.70 వేల జీతంతో కొలువులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌ (ఎడ్‌సిల్‌ ఇండియా).. ఒప్పంద ప్రాతిపదికన 28 యంగ్‌ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, మీడియా, లీగల్‌ తదితర..

EdCIL (India): బీటెక్‌ అర్హతతో నెలకు రూ.70 వేల జీతంతో కొలువులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..
EdCIL India

Updated on: Dec 09, 2022 | 5:36 PM

న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌ (ఎడ్‌సిల్‌ ఇండియా).. ఒప్పంద ప్రాతిపదికన 28 యంగ్‌ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, మీడియా, లీగల్‌, స్టాటిస్టిక్స్‌, ఆపరేషన్స్ రీసెర్చ్‌, ఎకనామిక్స్‌, పబ్లిక్‌పాలసీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎల్ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎమ్‌ లేదా నాన్‌ టెక్నికల్‌ కోర్సులో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us