Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం తెలంగాణలో విద్యా సంస్థలు గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో విద్యా సంస్థల సెలవులను మరో మూడు రోజుల పాటు పొడగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గురు, శుక్ర, శనివారం సెలవులు ప్రకటించి. సోమవారం నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఈరోజు సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి.
భారీగా కురుస్తోన్న వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవేళ వర్షాలు తగ్గుముఖం పట్టిన వాగులు మాత్రం పొంగి పొర్లడం ఖాయం. ఈ కారణంగానే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమాచారం.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..