DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

|

Jan 24, 2022 | 2:21 PM

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (IRC)లో అప్రెంటిస్ పోస్టుల (Aapprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనుంది.

DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..
Drdo
Follow us on

DRDO Apprentice Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (IRC)లో అప్రెంటిస్ పోస్టుల (Aapprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు
పోస్టు: DRDOలో అప్రెంటీస్ ఖాళీలు (గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్)

ఖాళీల సంఖ్య: 150
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 40 పోస్టులు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్: 60 పోస్టులు
ట్రేడ్ అప్రెంటీస్: 50 పోస్టులు

స్టై పెండ్: నెలకు రూ. 8000 నుంచి 9000 వరకు

అర్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ECE, EEE, CSE, మెకానికల్, కెమికల్ విభాగాల్లో B.E/B.Tech, B.Com లేదా BSc ఉత్తీర్ణత

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: ECE, EEE, CSE, మెకానికల్ మరియు కెమికల్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత

ట్రేడ్ అప్రెంటీస్: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్ విభాగాల్లో ITI ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు.

ఎంపిక విధానం: అభ్యర్ధులను అకడమిక్ మెరిట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు rcilab.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జనవరి 25, 2022.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Navy SSC Officer IT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!