ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇక నేరుగా పేరెంట్స్ వాట్సాప్‌కే హాల్ టికెట్స్! ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Telangana Inter Hall Ticket 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల 2026 పరీక్షల హాల్ టికెట్ల జారీ విషయంలో TSBIE వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక విద్యార్థుల హాల్‌టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపనుంది. పారదర్శకత, పొరపాట్లకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.

ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇక నేరుగా పేరెంట్స్ వాట్సాప్‌కే హాల్ టికెట్స్! ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
Telangana Inter Hall Ticket 2026 (1)

Edited By:

Updated on: Jan 02, 2026 | 4:43 PM

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. 2026 వార్షిక పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించనుంది. పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు అవకాశం లేకుండా, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బోర్డు ఈ హాల్ టికెట్ ప్రివ్యూ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ పంపబడుతుంది. దీని ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు హాల్ టికెట్‌లోని వివరాలను సరిచూసుకోవచ్చు.

హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకునేందుకు తమ SSC రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తమ మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తమ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

హాల్ టికెటే మిని మెమో

రెండవ సంవత్సరం విద్యార్థుల ప్రివ్యూ హాల్ టికెట్‌లో వారి మొదటి సంవత్సరం మార్కులు, ఫెయిల్ అయిన సబ్జెక్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్‌ను కూడా పొందుపరిచారు. దీనివల్ల విద్యార్థి విద్యా స్థితిగతులపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన ఉంటుందని బోర్డు తెలిపింది. హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, సంతకం, సబ్జెక్టులు లేదా మీడియం వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను గానీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని గాని సంప్రదించి సవరణలు చేయించుకోవాలని సూచించారు.

నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్ ఉన్నందున, సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ఈ వాట్సాప్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.