
దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2026 జనవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2026 మార్చిలో ఈ ప్రవేశ పరీక్షలు సబ్జెక్టుల వారీగా జరగనున్నాయి. అయితే ఈ సారి సీయూఈటీ పీజీ పరీక్ష విధానంలో ఎన్టీయే కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పరీక్ష ఒకపై కేవలం 90 నిమిషాలు అంటే గంటన్నరపాటు మాత్రమే ఆన్‌లైన్ విధానంలో జరగనుంది.
సీయూఈటీ సెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలు రోజుకు మూడు సెషన్ల చొప్పున జరుగుతాయి. దేశవ్యాప్తంగా మొత్తం 292 ప్రధాన నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విదేశాల్లోనూ 16 నగరాల్లోను ఈ పరీక్షలు జరుగుతాయి. విదేశాల్లోని భారతీయ విద్యార్థుల కోసం ఈసారి అంతర్జాతీయ పరీక్షకేంద్రాల సంఖ్యను 312కు పెంచుతున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. మొత్తం 157 సబ్జెక్టుల్లో సీయూఈటీ పీజీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఇస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.
ఇక దరఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచారు. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రెండు సబ్జెక్టులకు రూ. 200 చొప్పున చెల్లించాలి. జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్‌ను రద్దుచేశారు. ఇది వరకు ఈ పేపర్‌తోపాటు, సంబంధిత సబ్జెక్టు పేపర్లకు కూడా పరీక్షలు రాయాల్సి ఉండేది. జనవరి 14, 2026వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఫీజు చెల్లించేందుకు జనవరి 14, 2026 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పుల సవరణ 18,19, 20 జనవరి రాత్రి 11:50 గంటల వరకు చేసుకోవచ్చు. పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్‌కార్డుల విడుదల చేస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.