CUET 2022 exam pattern: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) – 2022కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ప్రైవేట్, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తెలిపింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు. ఈ పరీక్షకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండదు. అధిక కటాఫ్‌ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక్కో యూనివర్సిటికి ఒక్కో ప్రవేశపరీక్ష రాయాల్సినవసరంలేకుండా అన్నింటికీ కలిపి ఒకేసారి రాసే విధంగా ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్య సమాచారం మీకోసం..
అర్హతలు:
పరీక్ష విధానం: యూజీ పరీక్ష రెండు విడతలుగా ఆన్లైన్ మోడ్‌లో జరుగుతుంది. మొదటి స్లాట్‌లో 195 నిమిషాలు (3:15 గంటలు), రెండో స్లాట్‌లో 225 నిమిషాలు (3:45 గంటలు). మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. కొన్ని సెక్షన్లలో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఎంచుకున్న సబ్జెక్టుల ప్రకారం పరీక్ష వ్యవధి మారుతుంది. సిలబస్ కూడా అధిక శాతం ప్లస్‌టూ ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోంచే ఉంటుంది.
13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.
పరీక్షను మూడు భాగాలుగా ఉంటుంది
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరితేదీ: మే 6, 2022.
పరీక్ష తేదీ: జులై మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Also Read: