CSIR-CDRI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన లక్నోలోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR - CDRI).. ఒప్పంద ప్రాతిపదికన 21 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్‌ తదితర..

CSIR-CDRI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..
Csir Cdri

Updated on: Aug 23, 2022 | 8:13 AM

CSIR – CDRI Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన లక్నోలోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CDRI).. ఒప్పంద ప్రాతిపదికన 21 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి లైఫ్‌ సైన్సెస్‌/బయోటెక్‌/బయాలజీ/బయోటెక్నాలజీ/బయోలాజికల్‌ సైన్సెస్‌/బయోఇన్ఫర్మాటిక్స్‌/బయోకెమిస్ట్రీ లేదా తత్సమాన విభాగంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ లేదా గేట్‌లో వ్యాలిడ్‌ ర్యాంకు ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 28 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 31, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.47,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.