CPCL Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL).. 22 ఇంజనీర్ పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంట్, మెటలర్జీ, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఐటీఎస్, లీగల్ విభాగాల్లో ఖాళీలున్నాయి. జులై 1, 2022వ తేదీనాటికి అభ్యర్‌ధుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో (ఇంజనీరింగ్/టెక్నాలజీ ఇన్ కెమికల్/పెట్రోలియం/పెట్రోకెమికల్స్/ఎటక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/టెక్నాలజీ ఇన్ సివిలి/కంప్యూటర సైన్స్‌లో ఇంజనీరింగ్/మెకానికల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/లేబర్ వెల్ఫేర్/మాస్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ లేదా తత్సమాన విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష అక్టోబర్ 16, 2022వ తేదీన నిర్వహిస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.