CIIL Recruitment 2023: ఇంటర్వ్యూ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

|

Jan 02, 2023 | 7:17 PM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (CIIL).. ఒప్పంద ప్రాతిపదికన 14 సీనియర్‌ ఫెలో, అసోసియేట్‌ ఫెలో, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ తదితర..

CIIL Recruitment 2023: ఇంటర్వ్యూ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
Central Institute Of Indian Languages
Follow us on

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (CIIL).. ఒప్పంద ప్రాతిపదికన 14 సీనియర్‌ ఫెలో, అసోసియేట్‌ ఫెలో, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, యూడీసీ, ఎల్‌డీసీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ ఎంసీఏ/ మాస్టర్స్‌ డిగ్రీ/ డాక్టోరేట్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కర్ణాటకలోని మైసూర్‌లలో పనిచేయవల్సి ఉంటుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు (జనవరి 16, 2023) దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,200ల నుంచి రూ.41,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.