C-DOT Jobs 2022: నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో సీ-డాట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌ అర్హత..

సెంటర్‌ ఫర్‌ డెవలస్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమాటిక్స్‌ (సీ-డాట్) ఢిల్లీ, బెంగళూరులలో పనిచేయడానికి.. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

C-DOT Jobs 2022: నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో సీ-డాట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌ అర్హత..
CDOT New Delhi

Updated on: Dec 04, 2022 | 7:02 PM

సెంటర్‌ ఫర్‌ డెవలస్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమాటిక్స్‌ (సీ-డాట్) ఢిల్లీ, బెంగళూరులలో పనిచేయడానికి.. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్లికేషన్స్, రేడియో యాక్సెస్ టెక్నాలజీ, ఓపెన్ ఆర్‌ఏఎన్‌, ప్యాకెట్ కోర్ డెవలప్‌మెంట్, ఫీల్డ్ సపోర్ట్ అండ్‌ వ్యాలిడేషన్, నెట్‌వర్క్ అండ్‌ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌, ఆప్టికల్ టెక్నాలజీస్, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్‌ మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లోబీఈ, బీటెక్‌ (ఈసీ/ సీఎస్‌), ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 15, 2022వ తేదీలోపు careers@cdot.in ఈ మెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ. 2 లక్షలుపైగా జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us