BSF Recruitment 2022: పదో తరగతి అర్హతతో బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 110 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF)లో.. సెంటర్‌ హెడ్‌, ట్రైనర్ పోస్టుల (SI, Constable Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

BSF Recruitment 2022: పదో తరగతి అర్హతతో బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 110 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
Bsf Recruitment

Updated on: Jun 14, 2022 | 9:30 AM

BSF SI Constable Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF)లో.. సెంటర్‌ హెడ్‌, ట్రైనర్ పోస్టుల (SI, Constable Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 110

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 22
  • కానిస్టేబుల్‌ పోస్టులు: 88

విభాగాల వారీ ఖాళీలు:

  • ఎస్సై (వెహికల్ మెకానిక్):12
  • ఎస్సై (ఆటో ఎలక్ట్రీషియన్): 4
  • ఎస్సై (స్టోర్ కీపర్): 6
  • కానిస్టేబుల్ (OTRP) పురుషులు: 8
  • కానిస్టేబుల్ (OTRP) మహిళలు: 1
  • కానిస్టేబుల్ (SKT) పురుషులు: 6
  • కానిస్టేబుల్ (ఫిట్టర్) పురుషులు: 6
  • కానిస్టేబుల్ (ఫిట్టర్) మహిళలు: 1
  • కానిస్టేబుల్ (కార్పెంటర్) పురుషులు: 4
  • కానిస్టేబుల్ (ఆటో ఎలెక్ట్) పురుషులు: 9
  • కానిస్టేబుల్ (ఆటో ఎలెక్ట్) మహిళలు: 1
  • కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్) పురుషులు: 17
  • కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్) మహిళలు: 3
  • కానిస్టేబుల్ (BSTS) పురుషులు: 6
  • కానిస్టేబుల్ (BSTS) మహిళలు: 1
  • కానిస్టేబుల్ (వెల్డర్) పురుషులు: 10
  • కానిస్టేబుల్ (వెల్డర్) మహిళలు: 1
  • కానిస్టేబుల్ (పెయింటర్) పురుషులు: 4
  • కానిస్టేబుల్ (అప్హోల్స్టర్) పురుషులు: 5
  • కానిస్టేబుల్ (టర్నర్) పురుషులు: 5

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు:

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో మూడేళ్ల ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    విభాగాలు: వెహికిల్‌ మెకానిక్‌, ఆటో ఎలక్ట్రీషియన్‌, స్టోర్‌ కీపర్‌.
    పే స్కేల్‌: నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • కానిస్టేబుల్‌ పోస్టులకు పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
    విభాగాలు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, ఆటో ఎలక్ట్రిక్‌, వెహికిల్‌ మెకానిక్‌, వెల్డర్‌, టర్నర్‌, పెయింటర్‌ తదితర విభాగాలు.
    పే స్కేల్‌: నెలకు రూ.21,700 ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • గ్రూప్‌ ‘బీ’ పోస్టులకు: రూ.200
  • గ్రూప్‌ ‘సీ’ పోస్టులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, ఇతర అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us