BSF Recruitment 2022: బీఎస్ఎఫ్‌లో 2,700 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, వివరాలు..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో 2,788 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

BSF Recruitment 2022: బీఎస్ఎఫ్‌లో 2,700 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, వివరాలు..
Bsf Constable Recruitment 2

Updated on: Jan 25, 2022 | 3:04 PM

BSF Constable Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో 2,788 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

పోస్టు: బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 2,788

ఖాళీల వివరాలు:
పురుషులు: 2,651 పోస్ట్‌లు
స్త్రీ: 137 పోస్ట్‌లు

వయో పరిమితి: ఆగస్టు 1, 2021 నాటికి అభ్యర్ధులకు 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

పే స్కేల్: రూ. 21,700 – 69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
ఓబీసీ అభ్యర్ధులకు రూ. 100
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CSIR – CIMFR Jobs: 68 ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే!