BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో 337 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Apr 18, 2022 | 8:20 PM

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో ఉన్న 337 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో...

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో 337 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Bis Jobs
Follow us on

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో ఉన్న 337 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 337 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో డైరెక్టర్‌ 1, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 3, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 47, జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్ 61‌, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 100‌, సీనియర్‌ టెక్నీషియన్ 25‌, పర్సనల్‌ అసిస్టెంట్‌ 28, అసిస్టెంట్‌ 2, టెక్నికల్‌ అసిస్టెంట్‌ 47, మెకానికల్‌ 19, కెమికల్‌ 18, మైక్రోబయాలజీ 10, స్టెనోగ్రాఫర్‌ 22, హార్టికల్చ్‌ సూపర్‌వైజర్‌ 1 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 19-04-2022న మొదలవుతుండగా, మే 9ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IPL 2022 వేలంలో అతడిని ఎవరూ కొనాలనుకోలేదు.. కానీ ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే..!

Ice Facial: వేసవిలో ఐస్ క్యూబ్స్‏తో ముఖంపై రుద్దుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోండి..

Eggs Side Effects: గుడ్డుతో ఈ ఆహారపదార్థాలను తీసుకుంటున్నారా ? జాగ్రత్త మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే..