BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగుస్తోంది.

|

Jun 08, 2021 | 6:01 PM

BEL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. బెంగ‌ళూరులో ఉన్న ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో...

BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగుస్తోంది.
Bel
Follow us on

BEL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. బెంగ‌ళూరులో ఉన్న ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 09 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా.. ట్రెయినీ ఇంజ‌నీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు.

* ట్రైయిన్ ఇంజ‌నీర్ (06) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఏరోస్పేస్‌/ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అభ్య‌ర్థులు 01-05-2021 నాటికి 25 ఏళ్లు మించ‌కూడదు.

* ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ (03) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఏరోస్పేస్‌/ఏరోనాటికిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంఈ/ ఎంటెక్‌ అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు. అభ్య‌ర్థుల వ‌య‌సు 01.05.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థులను ఇంజనీరింగ్‌ డిగ్రీ మార్కులు, గత అనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల వివరాల‌ను మేనేజర్ (హెచ్‌ఆర్‌/ఎస్‌సీ–యూఎస్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహల్లీ, బెంగళూరు–560013 చిరునామాకు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (09-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Proteins: మన శరీరానికి ప్రోటీన్లు ఎందుకు అవసరం.. ప్రోటీన్లు తక్కువైతే ఏం జరుగుతుంది? తెలుసుకోండి!

RCFL Recruitment: డిగ్రీ అర్హత ఉన్నవారికి మంచి అవకాశం మంచి వేతనంతో జాబ్ నోటిఫికేషన్..

Canara Bank Recruitment 2021: కెనరా బ్యాంకు ఆఫీసర్‌ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూన్‌ 30