Bank of India Jobs 2025: నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు! డిగ్రీ పాసైతే చాలు

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ స్ట్రీములో క్రెడిట్‌ ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌ 3, ఎంఎంజీఎస్‌ 2, ఎస్‌ఎంజీఎస్‌ 4) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

Bank of India Jobs 2025: నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు! డిగ్రీ పాసైతే చాలు
Bank Of India Credit Officer Jobs

Updated on: Dec 18, 2025 | 6:14 AM

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ స్ట్రీములో క్రెడిట్‌ ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌ 3, ఎంఎంజీఎస్‌ 2, ఎస్‌ఎంజీఎస్‌ 4) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 514 క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 20 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు..

  • క్రెడిట్ ఆఫీసర్(ఎస్‌ఎంజీఎస్‌ 4) పోస్టులు: 36
  • క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌ 3) పోస్టులు: 60
  • క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌ 2) పోస్టులు: 418

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 5, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఎంఎంజీఎస్‌ 2 పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు, ఎస్‌ఎంజీఎస్‌ 4 పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు, ఎంఎంజీఎస్‌ 3 పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం

రాత పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్రలకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిస్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు, రీజనింగ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు 75 మార్కులకు వస్తాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us