
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఏపీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (APTRANSCO) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 135 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2026 జులై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్ల (47 ఏళ్లు) సడలింపు ఉండగా, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 52 ఏళ్లు వరకు వయో సడలింపు కల్పించారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 20, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 స్టైపెండ్ అందజేయనున్నారు. ప్రొబేషన్ పూర్తయిన తర్వాత రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ మాక్ టెస్టులు ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండగా, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆగస్టు 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక ఆన్సర్ కీ పరీక్షల అనంతరం రెండు రోజుల్లో విడుదల చేయనుండగా, తుది మెరిట్ జాబితా సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటించనున్నారు.
ఏపీ ఈపీడీసీఎల్‌లో ఇంజినీర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలకు ఉంటుంది. పరీక్షలో కోర్ సబ్జెక్టుకు 70 మార్కులు కేటాయించగా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలకు మిగిలిన మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇది మంచి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఏపీ ఈపీడీసీఎల్‌లో ఇంజినీర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.